ప్రతి మహిళకు ఉచితంగా రెండు ఇందిరమ్మ చీరలు

JGL: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు ఉచితంగా ఇవ్వనున్నట్లు మహిళా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు అందే భవితరాణి తెలిపారు. ప్రతి చీర విలువ సుమారు రూ.800లు ఉంటుందని, ఈ కార్యక్రమం వల్ల బతుకమ్మ చీరల పంపిణీతో పాటు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.