వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: రాజమండ్రిలోని GGH వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.60 లక్షల నిధులతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాల మేరకు వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.