మేడ్చల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
MDCL: మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూడుచింతలపల్లి (లక్ష్మాపూర్), ఉద్దమర్రి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసింహులు యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.