రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: అనంతపురంలోని అజాద్ నగర్‌లో ముస్లిం సోదరులకు MLA దగ్గుపాటి ప్రసాద్ సోమవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మైనార్టీల పథకాలను ఎత్తివేసి ద్రోహం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వ బడ్జెట్‌లో మైనార్టీల కోసం రూ.6,090 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.