'ఖోఖో పోటీల్లో సెమీ ఫైనల్‌కు చేరిన ఆదిలాబాద్ జట్టు'
ADB: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన 58వ అంతర్ జిల్లాల ఖోఖో సీనియర్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు టాపర్‌గా నిలిచింది. శనివారం రాత్రి నిర్వహించిన అన్ని మ్యాచ్‌ల్లోనూ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ టీంలను ఓడించి సెమీఫైనల్‌కు చేరినట్లు కోచ్ రాంకుమార్, శంకర్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను ఖోఖో కమిటీ సభ్యులు అభినందించారు.