ప్రజలపై పెరిగి పోతున్న విద్యుత్ బిల్లుల భారాలు: సీపీఎం

GNTR: స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని గతంలో పిలుపునిచ్చిన కూటమి నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో మంగళవారం నళినీకాంత్, అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు.