సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ విద్యార్థిని

సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ విద్యార్థిని

MNCL: జన్నారం మండలంలోని చింతగూడ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా తాటి సుప్రియ శ్రీ హర్ష పోటీ చేస్తున్నారు. హైదరాబాదులో బీటెక్ చేస్తున్న ఆమె గ్రామానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, చింతగూడ గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి పదిమంది, వార్డు స్థానాలకు 30 మంది పోటీ పడుతున్నారు.