'ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి అనాగరికం'

'ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి అనాగరికం'

అన్నమయ్య: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ న్యాయవాదుల వాదనలు వింటున్న సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు‌తో దాడి చేయడం అనాగరిక చర్య అని చిట్వేలు మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షుడు మంద నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిట్వేలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి తహసిల్దారుకు వినతిపత్రం సమర్పించారు.