రావిగుంటపల్లిలో పోషణ పక్షోత్సవాలు

రావిగుంటపల్లిలో పోషణ పక్షోత్సవాలు

ప్రకాశం: పామూరు మండలం రావిగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్షోత్సవాలు ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి నిర్వహించారు. ఈ సందర్భంగా 3-6 ఏళ్ల పిల్లల ప్రారంభ విద్య, ఎదుగుదలపై అవగాహన కల్పించారు. ఆటలు, పాటల ద్వారా నేర్చుకోవడం పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదమని తెలిపారు. పోషకాహారం ప్రాధాన్యత, ఎత్తు-బరువు పర్యవేక్షణపై వివరించారు.