VIDEO: ఖమ్మంలో భారీగా దంచి కొడుతున్న భారీ వర్షం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం రూరల్, కూసుమంచి, ఖమ్మం నగరం, నేలకొండపల్లి, వైరా, ముదిగొండ, రఘునాథపాలెం తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రానున్న మూడు రోజులు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.