VIDEO: మల్యాలలో నాటు కోళ్లు మృత్యువాత
MHBD: మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామంలో రైతు నిషార్ నాటు కోళ్ల పెంపకం కోసం ఫామ్ ఏర్పాటు చేసుకొని కోళ్లు పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆకస్మాత్తుగా 800 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.