'జన గణన-2027' కార్యక్రమంపై శిక్షణ తరగతులు
PLD: 'జన గణన-2027'పై శుక్రవారం మాచవరం హై స్కూల్ ఆవరణలో యన్యుమినేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. 'జన గణన-2027' ప్రక్రియ ప్రారంభమైందని దీనిపై యన్యుమినేటర్లు, సూపర్‌వైజర్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వెబ్‌సైట్ ద్వారా స్వీయగణన నమోదుచేసుకున్న వారి వివరాలను పరిశీలించాలన్నారు.