VIDEO: ఓటు వినియోగించుకున్న వృద్ధులు, వికలాంగులు
KMM: మున్సిపల్ ఎన్నికల వేళ ఖమ్మం రూరల్ జలగం నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఆదర్శవంతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. వయసు మళ్లిన వారు, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు సైతం ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు. కుటుంబ సభ్యుల సహాయంతో వీల్ చైర్లు, కర్రల సాయంతో కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.