VIDEO: 3వేల మందికి పరీక్ష ఫీజు కట్టిన మడకశిర ఎమ్మెల్యే

VIDEO: 3వేల మందికి పరీక్ష ఫీజు కట్టిన మడకశిర ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న 3 వేల మంది విద్యార్థులకు ఎమ్మెల్యే రాజు పరీక్ష ఫీజు చెల్లించారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే తన సొంత నిధులతో 3వేల మందికి రూ.3,60,000 లక్షల విలువ గల చెక్కులను మండల ఎంఈవో శ్రీనివాస్‌ భాస్కర్‌కు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని ఆయన కోరారు.