మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
KMR: బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో జాతీయ రహదారి 44పై ఓ హోటల్ దగ్గరలో ఆదివారం గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో దోమకొండలో కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గమనించి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని పరామర్శించాడు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.