'పేదవాడి గూడుపై పెదవి విప్పకపోవడం శోచనీయం'
ELR: టిడ్కో గృహాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని సీపీఐ నూజివీడు నియోజకవర్గ సమితి కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా నూజివీడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి పేదవాడి గూడు పై పెదవి విప్పకపోవడం శోచనీయమన్నారు.