రైతుబజార్ ఏవోకు సేవారత్న అవార్డు
VSP: ఎంవీపీ రైతుబజార్ ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే.వరహాలుకు సేవారత్న అవార్డు ప్రదానం చేశారు. మదర్ తెరిసా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, గత 18 ఏళ్లుగా రైతుబజార్‌కు అంకితభావంతో సేవలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ గౌరవం కల్పించారని పేర్కొన్నారు.