రహావీర్ పథకం తొలి అవార్డ్ అందజేసిన పొన్నం
HYD: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రవాణా శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం రహావీర్ పథకంలో భాగంగా తొలి అవార్డును నల్గొండకు చెందిన వెంకన్నకు అందజేసి, రూ.25 వేల చెక్కును పంపిణీ చేశారు. రవాణా శాఖ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని అధికారులకు సూచించారు.