సర్పంచ్ ఎన్నికలు.. కీలకంగా జెన్-Z తరం!
TG: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జెన్-జడ్ తరం ముందుకొస్తోంది. 1997–2012 మధ్య జన్మించిన ఈ యువత ఎన్నికల వేడిలో కీలక శక్తిగా మారుతోంది. నోటిఫికేషన్ విడుదలైన రోజునుంచే తమ గ్రామాల సమస్యలను గుర్తించి, అభ్యర్థుల నుంచి స్పష్టమైన హామీలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. సమస్యలకు గట్టిగా హామీ ఇచ్చే నాయకులకు మాత్రమే ఓటు వేయాలంటూ ఓటర్లను కూడా చైతన్యపరుస్తోంది.