సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన విడదల రజని

సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన విడదల రజని

PLD: మాజీ మంత్రి విడదల రజిని రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తానని మంగళవారం స్పష్టం చేశారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే బరిలోకి దిగుతున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసులకు, వేధింపులకు భయపడకుండా పోరాటం చేస్తున్న తనపై తప్పుడు వార్తలు రాయొద్దని కోరారు.