గైట్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన

గైట్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన

E.G: రాజానగరంలోని గైట్ కళాశాల వద్ద SFI ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోయినా, యాజమాన్యం తమపై ఒత్తిడి తెస్తోందని నిరసన తెలిపారు. దీంతో కళాశాల యాజమాన్యం స్పందిస్తూ.. ఫీజుల విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.