తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి: చంద్రబాబు

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి: చంద్రబాబు

AP: కృష్ణా నదిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 16 కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. వీటికి KRMB అనుమతులు లేవని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.