'యువత బెట్టింగులకు దూరంగా ఉండాలి'

NLG: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంలో అన్‌లైన్ బెట్టింగులకు యువత దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఐతగోని శేఖర్ గౌడ్ సూచించారు. మద్యం సేవించి మైకంలో బెట్టింగులకు పాల్పడి ఇబ్బందులకు గురి కావద్దని, మీ మీద మీ కుటుంబం ఎన్నో ఆశలతో ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం నల్గొండలో ఒక ప్రకటన విడుదల చేశారు.