బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఉపేక్షించబోము: CI

బెల్ట్  షాపులు నిర్వహిస్తే ఉపేక్షించబోము: CI

VZM: బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు శనివారం సాయంత్రం బాడంగి మండల రామచంద్రాపురం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసిన, అమ్మిన, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.