క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి నిన్న హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో విజయం సాధించి, అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు అచంచలమైన ధైర్యం, పట్టుదల, సంకల్పబలం ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు.