రూ.3 కోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు

చిత్తూరు: ఉమ్మడి జిల్లాలో ఆదివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లుల వసూల్ కేంద్రాలను తెరిచారు. దీంతో మొత్తం 10,074 సర్వీసుదారులు తమ బిల్లులు చెల్లించారు. దీంతో రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కూడా వసూలు కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.