నూతన ఎస్సైను సన్మానించిన పట్టణవాసులు

నూతన ఎస్సైను సన్మానించిన పట్టణవాసులు

BDK: ఇల్లందు పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణను నేడు కాంగ్రెస్ నాయకులు మరియు పుర ప్రముఖులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ... పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.