రేపు డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

KDP: మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 19న ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ప్రకటనపైనే చేశారు.