20 తులాల బంగారు నగలు చోరీ
NRPT: మక్తల్ మండలంలో తాళం వేసిన ఒ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరి చేసిన ఘటన చోటుచేసుకుంది. భాదితుల వివరాలు.. జక్లర్ గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి చరవాణి దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజువారిలాగే ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చి చూడగా 20 తులాల బంగారం, రూ. 4 లక్షలు చోరికి గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.