కరెంట్ షాక్ తగిలి గేదే మృతి

SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం శివారులో కరెంట్ షాక్ తగిలి గేదే మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన బాలాజీ రావు అనే రైతు గేదే రోజు మాదిరిగానే మేయడానికి వెళ్లి స్థానిక శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీగలకు తగిలి గేదే అక్కడికక్కడే మృతి చెందిందని బాధిత రైతు తెలిపారు. ఐదేళ్ల వయస్సు గల గేదే రూ.60 వేల విలువ ఉంటుందని చెప్పారు.