ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి: ఎంపీడీవో

రెండవ దశలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఆదివారం బోథ్ మండలంలోని పొచ్చెరలో బోథ్ ఎంపీడీవో రమేష్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుపుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. దళారులకు తావు లేదని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను ఆర్థిక వనరులను ప్రత్యక్షంగా పరిశీలించారు.