VIDEO: గరికపాటి వ్యాఖ్యలపై ఎస్ఎఫ్ఎ ఆగ్రహం
KRNL: మధ్యాహ్న భోజన పథకంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు సాయి డిమాండ్ చేశారు. విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడటం అమానవీయమని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నాయకులు సాయి, ఉదయ్ రంగప్ప పేర్కొన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.