కూతురి పెళ్లి కోసం తండ్రి ఆత్మహత్య
MDK: కూమార్తె వివాహానికి ఎవరూ అప్పు ఇవ్వడంలేదనే మనస్తాపంతో ఓ తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ పెద్ద కుమార్తె నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి ఉండటంతో ఖర్చుల కోసం చాలా మంది వద్ద అప్పు కోసం ప్రయత్నించగా ఎవరు ఇవ్వకపోవడంతో ఓ మూతపడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.