విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ
NZB: కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బోర్గాం(పి) జడ్పీ ఉన్నత పాఠశాలలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఆమె ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోషకాహారం తీసుకోవాలని, కంటి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.