'ఆర్జీలను సత్వరమే పరిష్కరించండి'
HYD: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో అందచేసిన అర్జీలను సత్వరమే అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు కదివన్ పలని, ముకుంద రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.