రూ.2 కోట్లతో సీసీ రోడ్ల శంకుస్థాపన
WGL: "పల్లెలే పట్టుకొమ్మలు” అనే నినాదంతో గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట, తోపనపల్లి, అలంకానిపేట, రెడ్లవాడ, చంద్రుగొండ, నాగారం, దీక్షకుంట గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు రూ.2 కోట్ల 30 లక్షల నిధులతో ఆయన శంకుస్థాపన చేశారు.