9 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుడు పరార్
నెల్లూరు నుంచి గూడూరు మధ్య రామేశ్వరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జనరల్ బోగీలోని ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తెరిచి పరిశీలించారు. అందులో 9 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడని రైల్వే డీఎస్సీ మురళీధర్ తెలిపారు.