10న రాంకో పరిశ్రమ వద్ద ధర్నా: సీపీఐ
NDL: రాంకో సిమెంట్ పరిశ్రమ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 10న సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు సోమవారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సీపీఐ నేత సూరి తెలిపారు. రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. పరిశ్రమ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ధర్నా ద్వారా గళం ఎత్తనున్నట్లు స్పష్టం చేశారు.