గృహజ్యోతి పథకం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత 200 యూనిట్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు సీనియర్ అసిస్టెంట్ దశరథ సోమవారం తెలిపారు. మండలంలో కరెంట్ బిల్లులో జీరో బిల్లు రానివారు ప్రజా పాలన రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు జిరాక్సులు తీసుకొని వచ్చి కౌంటర్లో అందజేయాలన్నారు.