వైష్ణవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు

వైష్ణవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు

CTR: పుదీపట్ల‌లో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వయంభు వైష్ణవి దేవి ఆలయం కిటకిటలాడింది. అనంతరం ఆలయ నిర్మాణ కర్త వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు.