VIDEO: లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
SRCL: తంగళ్ళపల్లి మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామం పరిసరాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. మేళాలు, హారతులు, మంగళవాద్యాలతో గుట్ట చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది. భక్తి ఉత్సాహాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.