కులవివక్ష పాటిస్తే కఠిన చర్యలు: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
MDK: కొల్చారం మండలం రంగంపేటలో సోమవారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీవిద్య పాల్గొన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా కులవివక్ష పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వివక్షకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత, ఏఎస్ఐ సుగుణాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.