కోనాపూర్ శివారులో చిరుత పులి సంచారం..?

కోనాపూర్ శివారులో చిరుత పులి సంచారం..?

MDK: రామాయంపేట మండలం కోనాపూర్ శివారులో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. శనివారం ఉదయం గ్రామ శివారులో పంచాయతీ వాటర్ మెన్ నీరు వదలడానికి వెళ్లగా చిరుత పులి కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న FRO విద్యాసాగర్ విచారణ చేపట్టారు. ఏలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.