గ్రామీణ పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు: సీఐ

VZM: పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని విజయనగరం గ్రామీణ సీఐ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు మ్యాక్స్ విజన్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో శనివారం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది వృత్తి పరంగా ఆరోగ్యంఫై శ్రద్ధ చూపకపోవడంవలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.