పీఎంపీలు హాస్పిటల్‌లు నడపరాదు: DMHO

పీఎంపీలు హాస్పిటల్‌లు నడపరాదు: DMHO

SKLM: పీఎంపీలు హాస్పిటల్స్ నడుపరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. అనిత స్పష్టం చేశారు. సంబంధిత అసోసియేషన్లతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్లు ఎవ్వరూ కూడా ఇంజక్షన్లు, గాయాలకు కుట్లు వెయ్యరాదని ఆమె హెచ్చరించారు. వైద్యం చేస్తుండగా ప్రమాదం సంభవిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.