మాధవపట్నంలో విద్యార్థులకు సీఐ సూచన

మాధవపట్నంలో విద్యార్థులకు సీఐ సూచన

కాకినాడ: ప్రస్తుత సమాజంలోని పరిస్థితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ సూచించారు. గురువారం మాధవపట్నం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, వాట్సాప్ చాటింగ్, అపరిచిత వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏ చిన్న సమస్య వచ్చినా దాచిపెట్టకుండా తల్లిదండ్రులతో పంచుకోవాలని అన్నారు.