‘నిష్కళంక నాయకుడు రోశయ్య’

‘నిష్కళంక నాయకుడు రోశయ్య’

NRPT: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ నిష్కళంక నాయకుడిగా నిలిచారని డీఎస్పీ లింగయ్య అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంగా రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.