సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
BDK: కొత్తగూడెంలో గురువారం జరుగుతున్న సైన్స్ ఫెయిర్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ పాల్గొని మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి బాల విద్యా విజ్ఞానిక సైన్స్ ఫెయిర్ తొలిమెట్టని వారు అన్నారు. విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ దోహదం చేస్తాయని చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.