కొలిమిగుండ్లలో దళిత సంఘం నాయకులు నిరసన
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో శుక్రవారం దళిత సంఘం నాయకులు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు జడ్జి గవాయిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘం నాయకులు బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రాన్ని అందజేశారు.