తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికలు
యాదాద్రి: చౌటుప్పల్ మండలానికి చెందిన పలువురు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న వారికి హైదరాబాదులోని తన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా పనిచేస్తున్న పార్టీలోకి గట్టు మొగులయ్య ఆధ్వర్యంలో చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు పోటీ చెయ్యాలని మల్లన్న సూచించారు.